top of page

Fake RPF Lady Police: పోలీస్ డ్రెస్సులోనే పెళ్లి చూపులకు.. బయటపడిన 'మేడం' బండారం..



ఆర్పీఎఫ్ ఎస్సై ఆమె.. రోజూ యూనిఫాంలోనే డ్యూటీకి వెళ్తుంది.. అప్పుడప్పుడూ దైవదర్శనాలు కూడా చేసుకుంది. అది కూడా యూనిఫాంలోనే.. ఇలా ఏడాదిగా అందరనీ నమ్మించిది ఆ యువతి. అయితే.. పెళ్లి చూపులకు కూడా ఆమె యునిఫాంలోనే వెళ్లింది. బడాయి చూపించుకోవాలనుకుందో.. లేదా అబ్బాయి తరపు వాళ్లను కూడా తాను పోలీసునని నమ్మించి కంట్రోల్‌లో పెట్టాలనుకుందో కానీ.. ఆమె అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది ఇంకొకటి. ఏడాదిగా గుట్టుగా దాచిన తన బండారం.. అందరి ముందు బయటపడిపోయింది. తాను అసలు.. పోలీసే కాదని.. ఏడాదిగా యూనిఫాం వేసుకుని కవరింగ్ చేస్తుందన్న రహస్యం అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది పోలీసులకు అసలు విషయం చెప్పటంతో.. ఆ నకిలీ ఎస్సైని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన జడల మాళవిక.. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్‌ ఎస్సై పరీక్ష రాసింది. రాతపరీక్షలో ఉత్తీర్ణురాలు కాగా.. మెడికల్ టెస్టులో భాగంగా.. కంటి సమస్య (మెల్ల కన్ను) ఉండడంతో పక్కనపెట్టేశారు. కానీ.. మాళవిక మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా.. తనకు ఉద్యోగం వచ్చినట్టుగా అందరినీ నమ్మించింది. ఆర్పీఎఫ్‌ ఎస్ఐగా శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా.. నకిలీ ఐడీ కార్డును, యూనిఫామ్‌ను సిద్ధం చేసుకుంది. రోజూ.. యూనిఫాం ధరించి డ్యూటీకి వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లేది.

అప్పుడప్పుడూ.. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా మాళవిక యూనిఫాంలోనే దర్శించుకుంది. ఇదే క్రమంలోనే.. మాళవికకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం చూడగా.. ఆ పెళ్లి చూపులకు కూడా మళవిక యూనిఫాంలోనే వెళ్లింది. తాను ఆర్‌పీ‌ఎఫ్‌ ఎస్ఐని అని పరిచయం చేసుకుంది. అయితే.. పెళ్లి చూపులకు కూడా అమ్మాయి పోలీస్ డ్రెస్సులో రావటం చూసి.. అబ్బాయి తరపు వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో.. ఆమె గురించి ఎంక్వైరీ చేయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో.. పై అధికారులను సంప్రదించగా ఏడాదిగా గుట్టుగా చేస్తున్న మోసం బట్టబయలైంది.దీంతో.. ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్సైగా చలామణి అవుతున్న మాళవికను అరెస్టు చేశారు.

అయతే.. జాబ్ రాలేదని తెలిస్తే.. తన తల్లిదండ్రులు బాధపడతారన్న ఉద్దేశంతోనే ఈ పనిచేసినట్టు పోలీసుల విచారణలో మాళవిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇన్‌స్టా గ్రాంలోనూ.. ఆర్పీఎఫ్ యూనిఫాంలోనే మాళవిక రీల్స్ చేసింది. ఇదంతా ఓకే కానీ.. ఏడాదిగా యూనిఫాం వేసుకుని డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి.. మాళవిక ఎక్కడికి వెళ్లేది..? ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించిన మాళవిక.. నెల నెలా జీతం ఎలా సమకూర్చుకుంది..? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్నలు.

bottom of page