top of page
MediaFx

అరుదైన వ్యాధితో బాధపడుతున్న 'పుష్ప' విలన్‌

జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్‌. తెలుగు ప్రేక్షకులకు కూడా ఫహాద్ పుష్ప సినిమాలో నటించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ద్వారా బాగా చేరువయ్యాడు. ప్రస్తుతం 'పుష్ప 2'లో కూడా ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు సమాచారం. ఇటీవలే 'ఆవేశం' సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇటీవల ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన ఫహాద్‌.. తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీహాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహాద్ తాను ఏడీహెచ్‌డీ వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు. ఏడీహెచ్‌డీ అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్. ఈ వ్యాధి ఉన్న‌వారిలో ఏకాగ్ర‌త లేక‌పోవ‌డం, హైప‌ర్ యాక్టివ్‌, హైప‌ర్ ఫోక‌స్ వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్నాడు.

41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడు. చిన్నతనంలోనే బయటప‌డితే న‌యం చేసే అవ‌కాశం ఉండేద‌ని, కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందని చెప్పారు. తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని వాపోయారు.

bottom of page