top of page
Suresh D

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజీనామా.. అసలు నిజమేమిటంటే..?🗳️✨

దేశంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. ఆయా చోట్ల నోటిఫికేషన్ విడుదలవగా నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు.

అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు తమ ప్రత్యర్థి పార్టీల నేతలపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో వస్తుంది ఏది నిజమో.. ఏది అబద్దమో అని తేల్చుకోలేక ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఆ వీడియోలో నిజమెంతా అన్నది ఇప్పుడు చూద్దాం. 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. ఇటలీకి వెళ్లిపోతున్నట్టుగా ఓ పేపర్ చూస్తూ చెప్తున్నట్టుగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమే కానీ.. రాహుల్ వాయిస్‌తో వస్తున్న మాటలు మాత్రం నిజం కాదు. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల కోసం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేస్తున్నప్పటి వీడియోను తీసుకుని.. అసలు మాటలను తీసేసి.. AI వాయిస్‌ను జోడించి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.🗳️


bottom of page