🏛️ ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 22: స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు 14 రోజుల తర్వాత కూడా చుక్కెదురయింది. 🏢
చంద్రబాబుకు సెప్టెంబర్ 10 విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుండడంతో ఆయన్ను వర్చువల్‌గానే జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. 💻 ఆన్‌లైన్‌లోనే విచారణ జరగ్గా.. తన అరెస్టు జరిగిన తీరుపై ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తికి చంద్రబాబు వివరించారు. 🗣️ ‘నన్ను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టు చేశారు. చేయని తప్పును చేశానని చెప్తున్నారు. నా అరెస్టు అన్యాయంగా జరిగింది. 46 ఏళ్ల రాజకీయా జీవితలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు. నా హక్కులను రక్షించాలి’ అని చంద్రబాబు కోర్టును కోరారు. ⚖️ అయితే అటు ఏసీబీ అధికారుల వాదనలను కూడా విన్న కోర్టు చంద్రబాబు రిమాండ్‌ను మరో 2 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లుగా పేర్కొంది. 📅🔒 మరోవైపు చంద్రబాబుకు అందుతున్న సౌకర్యల గురించి జైలు అధికారులను కోర్ట్ ఆరా తీసింది. 🔒🔓 దీనికి కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు కల్పించామని రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు. 🔑