జాతీయస్థాయిలో వివిధ పదవుల్లో ఉన్న తెలంగాణకు చెందిన బీజేపీ నేతలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 🗳️
ఈ క్రమంలో కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి 🙋♂️, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడితో పాటు రాజ్యసభ సభ్యుడిగా, మరికొన్ని కీలక పార్టీ పదవుల్లోనూ ఉన్న డా. కే. లక్ష్మణ్, ఇతర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, జాతీయస్థాయి రాజకీయాల్లో ఉన్న మురళీధర్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ తదితరులందరినీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 📣 ఆయా నేతలు తమ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తే భారతీయ జనతా పార్టీ గణనీయంగా తన సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుందని అధినేతల వ్యూహంగా కనిపిస్తోంది. 🔍 ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఎక్కడా ప్రస్తావించకుండానే మధ్యప్రదేశ్ తరహాలో పరోక్షంగా పెద్ద నేతలను తెరపైకి తీసుకొచ్చినట్టవుతుంది. 🏞️"