top of page
Suresh D

వాషింగ్ మిషన్‌లో భారీగా నోట్ల కట్టలు..


ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఓ సంస్థ యజమాన్యం ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వాషింగ్‌ మెషిన్‌లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాషింగ్ మెషీన్‌లో అంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు చూసి అధికారులు విస్తుపోయారు. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు.. విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘించి బోగస్ కంపెనీల సాయంతో అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం అందింది. బోగస్‌ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట సింగపూర్‌కు చెందిన గేలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హోరిజన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌ల్లో రూ.1,800 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు సమాచారం రావదంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ రెండు విదేశీ సంస్థలు ఆంథోనీ డి సిల్వా అనే వ్యక్తి పేరుతో నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతోపాటు అనుబంధ సంస్థలు లక్మిటన్ మారీటైమ్, హిందూస్థాన్ ఇంటర్నేషనల్, రాజనందిని మెటల్స్ లిమిట్, స్టావార్ట్ అల్లోయ్ ఇండియా లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, వశిష్ఠ కనస్ట్రక్షన్ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు.

bottom of page