top of page
Suresh D

స్మృతి మంధాన క్రేజ్ ముందు టాప్ హీరోయిన్లు కూడా పనికిరారు..🏏✨


డబ్ల్యూపీఎల్‌ 2024 రెండో సీజన్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. స్మృతి మంధాన (Smriti Mandhana) నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచింది. ఎట్టకేలకు RCB జట్టు ఒక ట్రోఫీ గెలిచిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే WPL 2024 విజయం ఆర్సీబీ ఉమెన్స్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, ఇతర ప్లేయర్ల క్రేజ్‌ను అమాతం పెంచింది. ఈ సక్సెస్‌తో మంధాన బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరగవచ్చని బ్రాండ్ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. 

వాల్యువేషన్‌ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీ క్రోల్ (Kroll) ఎండీ అవిరల్ జైన్ ‘మనీ కంట్రోల్‌’తో మాట్లాడుతూ.. మంధాన ప్రస్తుతం USD 10-12 మిలియన్ల(దాదాపు రూ.9.03) రేంజ్‌ బ్రాండ్ వ్యాల్యూ పొందుతోందన్నారు. అయితే ఆమె బ్రాండ్ పోర్ట్‌ఫోలియో సుమారు 30 శాతం పెరగవచ్చని చెప్పారు. 

బ్రాండ్ అంబాసిడర్‌గా మంధానను ఎంపిక చేసుకోవాలని చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఆర్సీబీ ఉమెన్స్‌ టైటిల్‌ గెలిచిన గుడ్‌విల్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. మెన్స్‌ ఐపీఎల్‌లో కూడా మార్కెటర్లు మంధానతో జాయింట్‌ క్యాంపెయిన్స్‌ చేయవచ్చని అవిరల్ పేర్కొన్నారు.  

WPL 2024లో RCB విజయం చరిత్రాత్మకమని మంధాన బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా అన్నారు. మంధాన ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియోపై మాట్లాడుతూ..‘ఐపీఎల్‌ విజయం మంధాన పోర్టిఫోలియోకు ఊపు తీసుకొస్తుంది. ఉదాహరణకు, ఆమె గల్ఫ్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్. దీనికి (MS) ధోని కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అలాంటి బ్రాండ్‌లకు తమ అథ్టెట్‌ చక్కగా పర్ఫార్మ్‌ చేస్తున్నారని, స్థిరంగా రాణిస్తున్నారని విశ్వాసం కలుగుతుంది.’ అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం మంధాన బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో 15-16 బ్రాండ్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఏడాది చివరకు పెరిగే అవకాశం ఉంది. ఆమె యంగ్, డైనమిక్, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆమె ఎండార్స్‌మెంట్‌లలో ఎస్‌బీఐ, నైకీ, రెడ్‌బుల్, హెర్బ్‌లైఫ్‌, పీఎన్‌బీ, మెట్‌లైఫ్ ఉన్నాయని మిశ్రా చెప్పారు. 

ఆమె హెల్త్‌కేర్ (హెర్బాలైఫ్), ఆటో (హ్యుందాయ్ మోటార్) నుంచి దుస్తులు (రాంగ్లర్) వరకు వివిధ ఇండస్ట్రీల బ్రాండ్ ప్రమోషన్స్ యాక్సెప్ట్‌ చేసింది. దీంతో ఆమె స్థాయిని పురుష క్రికెటర్లు రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ వంటి వారితో పోల్చవచ్చు. 

సోషల్ మీడియాలో స్మృతి మంధాన పాపులారిటీ విపరీతంగా పెరుగుతోంది. ఫాలోయింగ్, ఎంగేజ్‌మెంట్ పరంగా టాప్ బాలీవుడ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఎంగేజ్‌మెంట్‌ రేటు కంటెంట్‌కి లైక్స్‌, కామెంట్స్‌ ద్వారా ఇంటరాక్ట్‌ అయ్యే ఆడియన్స్‌ను సూచిస్తుంది. మంధాన ఎంగేజ్‌మెంట్‌ రేటు 12-15 శాతం ఉంది. ఇది చాలా మంది బాలీవుడ్ హీరోయిన్‌ల కంటే ఎక్కువ. 

ఇటీవల మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్స్‌ మైల్‌స్టోన్‌ అందుకుంది. WPL 2024 గెలుచుకున్న కేవలం ఆరు గంటల్లోనే, ఆమె ఫాలోయింగ్ ఒక మిలియన్ పెరిగింది. అలానే గత ఆరు నెలల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్ 50 శాతానికి పైగా పెరిగింది. సోషల్ మీడియా అవగాహన ఉన్న యంగ్‌ జనరేషన్‌ను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్‌లకు ఆమె బెస్ట్‌ ఆప్షన్‌. 

కొంత కాలంగా మహిళా క్రికెటర్లు ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని బ్రాండ్ వాల్యుయేషన్, స్ట్రాటజీ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ చెప్పారు. జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ వంటి వారికి పాపులారిటీ ఎక్కువగా ఉందని అడ్వర్టైజర్లు గుర్తిస్తున్నారని తెలిపారు. 

WPL మహిళా క్రికెటర్లకు కొత్త అవకాశాలను అందించింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ వంటివారు పురుష సహచరులతో పోల్చదగిన అగ్రిమెంట్స్‌ పొందారు. మహిళా క్రికెటర్లు కూడా బ్యాట్ స్పాన్సర్‌షిప్‌లను పొందుతున్నారు. మొత్తంమీద మహిళా అథ్లెట్ల ఎండార్స్‌మెంట్ ల్యాండ్‌స్కేప్ విస్తరిస్తోంది.🏏

bottom of page