top of page
Suresh D

ఎక్స్‌లో మరో కొత్త ఫీచర్‌.. వీడియో గేమ్‌ స్ట్రీమింగ్‌ను పరిచయం చేసిన ఎలాన్‌ మస్క్

ఎలాన్‌ మస్క్‌ ఎప్పూడూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటాడు. ఏం చేసినా సంచలనమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు.. సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటాడు.

ఎలాన్‌ మస్క్‌ ఎప్పూడూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటాడు. ఏం చేసినా సంచలనమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు.. సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటాడు. ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ఎక్స్‌ (X) (ట్విటర్‌)ను సూపర్‌ యాప్‌గా మార్చేందుకు సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆడియో/వీడియో కాలింగ్‌, పిక్‌-ఇన్‌-పిక్‌ మోడ్ వంటి ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మస్క్‌.. కొత్తగా మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేశాడు.

దీంతో యూజర్లు వీడియో గేమ్‌లను ఎక్స్‌లో స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మస్క్‌ స్వయంగా రెండుసార్లు పరీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ (X) అకౌంట్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఎక్స్‌లో వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ సిస్టమ్‌ను పరీక్షించాను. ఇది పనిచేస్తుంది అని ఎలాన్‌ మస్క్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. ట్విచ్‌, యూట్యూబ్‌కు ఎక్స్‌ గట్టి పోటీ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ట్విచ్‌ అనేది అమెజాన్‌కు చెందిన వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌. అలానే.. యూట్యూబ్‌లో కూడా వీడియో గేమ్‌లను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

bottom of page