top of page

ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది..ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

టెస్లా, స్పేస్ఎక్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X అధినేత ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) హ్యాకింగ్‌కు గురవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకల నేపథ్యంలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించవచ్చని మస్క్ సూచించారు.ఈవీఎంలను వ్యక్తులు లేదా AI సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, ఇది ఎన్నికల ప్రక్రియ integrityకి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలని కోరారు.మస్క్ పోస్టుపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, ఇండియాలో EVM హ్యాకింగ్ సాధ్యం కాదని, EVMలలో ఇంటర్నెట్, వైఫై లేదా బ్లూటూత్ కనెక్షన్ లేదని గుర్తు చేశారు.


bottom of page