top of page
MediaFx

🎥ఎన్నికల ఫలితాలు థియేటర్లలో లైవ్‌ ప్రదర్శణకి సిద్ధం!

ప్రపంచకప్, ఐపీఎల్ ఫైనల్‌ను ప్రసారం చేసిన సినిమా థియేటర్లు ఇప్పుడు ఎన్నికల ఫలితాలను కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి! దేశంలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికలకు నేటితో తెరపడనుంది, మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యజమానులు వాటిని సినిమా థియేటర్లలో లైవ్‌లో ప్రదర్శించాలని నిర్ణయించారు.ముంబైలోని ఎస్ఎం 5 కల్యాణ్, సియాన్, కంజూర్‌ మార్గ్‌లోని మూవీ మ్యాక్స్ థియేటర్లు, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్‌మాల్, నాగ్‌పూర్‌లోని మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణెలోని మూవీ మ్యాక్స్ వంటి థియేటర్లు వెండితెరపై ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. పేటీఎం వంటి యాప్‌లలో టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది. ఆరు గంటలపాటు ఫలితాలను ప్రసారం చేయనుండగా టికెట్ ధరలు రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. జనం ఆసక్తి చూపిస్తూ చాలా థియేటర్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి!


bottom of page