top of page

జిమ్‌లో కసరత్తులు చేసేవారికి హెచ్చరిక..🏋️‍♂️🚨

ఈ ప్రొటీన్ ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది. మన హృదయాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ప్రోటీన్ సహాయపడుతుంది.

మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. కండరాలను నిర్మించడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రొటీన్ ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది. మన హృదయాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ప్రోటీన్ సహాయపడుతుంది. అయితే ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? నేచర్ మెటబాలిజం అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక ప్రోటీన్ తీసుకోవడం గుండె, ధమనుల సమస్యలను కలిగిస్తుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుందని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చెబుతున్నారు.

ఈ వ్యాధి వల్ల ధమనులు గట్టిగా మారి, ఇరుకుగా కుచించుకుపోతాయి. అంతేకాకుండా ఎక్కువ ప్రొటీన్‌లు తీసుకోవడం వల్ల శరీరంలో అమినో యాసిడ్‌లు పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి స్త్రీలకు సగటున రోజుకు 2,000 కేలరీలు, పురుషులకు రోజుకు 2,500 కేలరీలు ప్రోటీన్ అవసరం. స్త్రీలు 440 కేలరీల కంటే ఎక్కువ ప్రొటీన్లు, పురుషులు 550 కేలరీల కంటే ఎక్కువ ప్రోటీన్లు తీసుకుంటే ధమనులు దెబ్బతింటాయి. ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైనవి..

మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలు పెరిగిన బరువు పెరుగుతారు. అధిక ప్రొటీన్లకు బదులుగా సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. పెరుగు, బ్రోకలీ, ఓట్స్, చైనీస్ బాదం, పాలు, చీజ్, వివిధ రకాల గింజలు, గుడ్లు, చికెన్, కాయధాన్యాలు ఎక్కువగా తినాలి.ఈ ఆహారాలు తినడం వల్ల అదనపు ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవల్సిన అవసరం ఉండదు. చాలా మంది జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నప్పుడు అదనపు సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు. రోజువారీ వ్యాయామం చేసే వారు పోషకాహారం తినాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదు. చేపలు లేదా మాంసం మాత్రమే తింటే.. పేగులు కూడా దెబ్బతింటాయి. తెలిసిందిగా.. ఈరోజు నుంచి మీ జీవనశైలిలో ఈ మార్పులను తీసుకువస్తే.. మీ గుండె వేయి కాలాలపాటు పదిలంగా ఉంటుంది.🏋️‍♂️

bottom of page