top of page
Suresh D

స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా..🚭🍵

స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. దీని నుంచి బయట పడాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల స్మోకింగ్‌ను అదుపు చేయవచ్చు.

స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. దీని నుంచి బయట పడాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల స్మోకింగ్‌ను అదుపు చేయవచ్చు. క్రమక్రమంగా ఈ అలవాటు అనేది తగ్గిపోతుంది. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ:

ప్రతి రోజూ క్రమం తప్పకుండా గ్రీన్ తాగడం వల్ల స్మోకింగ్‌ను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇదొ శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ మానేయాలి అనుకుంటే.. గ్రీన్ తాగడం బెస్ట్.

పాల ఉత్పత్తులు:

స్మోకింగ్ మానేయాలి అనుకునేవారు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో క్యాల్షియం అనేది మెండుగా ఉంటుంది. ఇది ఎముకలను బలరిచేందుకు శక్తిని ఇస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల ధూమపానాన్ని కంట్రోల్ చేయవచ్చు.

తృణ ధాన్యాలు:

బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపు చేస్తుంది. స్మోకింగ్ మానేయడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి.

నట్స్:

బాదం, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ధూమపానం చేయడం వల్ల ఎఫెక్ట్ అయిన చర్మం బాగుపడేలా చేస్తాయి.🚭

bottom of page