top of page

📢 భూకంపాలు జైపుర్, మణిపుర్‌లో! 🌏💥

మణిపుర్‌‌లోని ఉక్రుల్ పట్టణంలోని శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.🥺

రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5‌గా నమోదైనట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ వెల్లడించింది. ఉదయం 5.01 AM గంటలకు 20 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అలాగే రాజస్థాన్ రాజధాని జైపు‌ర్‌లో కూడా భూకంపం వచ్చింది.🫥 ఉదయం 4.00 AM గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైనట్లు జాతీయ సిస్మాలజి సెంటర్ పేర్కొంది. అయితే ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. మరికొందరైతే వీధుల్లో పరుగులు పెట్టారు.🌍 అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజె ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజస్థాన్‌లో జైపూర్‌తో సహా ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోని నొగొపా ప్రాంతంలో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page