top of page
Shiva YT

‘ఈగల్’ సునామీ..వీకెండ్‏లో అదరగొట్టేసిన రవితేజ.. 🌊

🎬 టీజర్, ట్రైలర్‏తోనే సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. చేతిలో ఆయుధం పట్టి పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించారు.

ఎప్పటిలాగే మరోసారి ఈగల్ మూవీతో తన నట విశ్వరూపం చూపించారు మాస్ మాహారాజా. అలాగే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించి కథను ముందుకు నడిపిన విధానం ప్రేక్షకులకు నచ్చేసింది. ఇందులో కావ్య థాపర్ కథానాయికగా నటించింది. మొదటి రోజు రూ. 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మూడు రోజుల్లోనే రూ. 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ రూ. 50 కోట్ల వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

🎥 ఈగల్ సినిమా రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఇప్పటికే 15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాగా.. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కానుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ మూవీని కూడా పీపుల్ మీడియా నిర్మిస్తుంది. 🌟


Comments


bottom of page