top of page
MediaFx

తేజ సజ్జ భారీ ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్..?


ప్రస్తుతం టాలీవుడ్ రైజింగ్ హీరోస్ లో పాన్ ఇండియా వైడ్ గా “హను మాన్” సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ కూడా ఒకడు. మరి ఇపుడు తాను చేస్తున్న సాలిడ్ చిత్రాల్లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రమే “మిరాయ్” (Miraai). మరి హను మాన్ లో సూపర్ హీరోగా కనిపించిన తేజ ఈసారి సూపర్ యోధ గా కనిపించనున్నాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మళయాళ స్టార్ యంగ్ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. మరి తనకి కార్తీక్ ఒక కీలక పాత్రకి గాను ఇంట్రెస్టింగ్ క్యామియో రోల్ ని డిజైన్ చేసాడట. అందుకు తాను ఓకే కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ రితిక నటిస్తుంది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న మొత్తం 7 భాషల్లో రిలీజ్ కానుంది.


Comments


bottom of page