top of page
Suresh D

భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్..🕵️‍♀️

మన దేశం నుంచి ఎక్కువ శాతం మంది టూరిస్ట్ లుగానూ అలాగే ఉద్యోగాల నిమిత్తం వెళ్లే ప్రాంతాల్లో దుబాయ్ కూడా ఒకటి. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నిరంతరం రాకపోకలు సాగుతూనే ఉంటాయి.

ఈ క్రమంలో దుబాయ్ మన భారతీయులను మరింత ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది. తమ దేశంలోకి రావాలనుకునే ఇండియన్స్ కు వీసా నిబంధనలను ఆ దేశం సులభతరం చేసింది. భారతీయుల కోసం ఐదేళ్ల మల్టిపుల్‌ ఎంట్రీ టూరిస్ట్‌ వీసాను ప్రకటించింది. దీనిని బిజినెస్‌, ట్రాన్సిట్‌, టూరిస్ట్‌, వర్క్‌ వీసాలుగా విభజించింది. దీని దరఖాస్తు చేసుకునే విధానం, అర్హతలు తదితర వాటిని తెలుసుకుందాం. 

భారతదేశం నుంచి పర్యాటకుల రాకను పెంచుకోవడానికి దుబాయి ఈ ఐదేళ్ల మల్లిపుల్‌ ఎంట్రీ టూరిస్ట్‌ వీసాను ప్రకటించింది. దరఖాస్తు దారుల నుంచి సర్వీస్‌ రిక్వెస్ట్‌ను స్వీకరించిన సుమారు ఐదు రోజుల్లోనే దీనిని జారీ చేస్తారు. ఈ వీసా ద్వారా ఓకేసారి తొంభై రోజుల పాటు ఆ దేశంలో ఉండటానికి అనుమతి లభిస్తుంది. ఏడాదికి గరిష్టంగా 180 రోజులు ఉండేలా.. దాదాపు ఐదేళ్ల పాటు ఆ దేశంలో అనేక సార్లు సందర్శించవచ్చు. 

దుబాయి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ది ఎకానమీ అండ్‌ టూరిజం (డీఈటీ) తెలిపిన నివేదిక ప్రకారం 2023 నుంచి జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ 2.46 మిలియన్ల భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. కాగా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ నూతన వీసా విధానంతో పర్యాటకులు ఎక్కువ సార్లు దుబాయిని సందర్శించగలరు. వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే విహరయాత్రలు కూడా పెరుగుతాయి. దీని ద్వారా భారత్‌, దుబాయ్‌ల మధ్య సంబంధాలు కూడా మెరుగవుతాయి. డీఈటీ సమీపంలోని ప్రాక్సిమిటీ మార్కెట్‌ రీజినల్‌ హెడ్‌ బాదర్‌ అలీ హబీద్‌ మాట్లాడుతూ భారత్‌తో ధీర్ఘకాల సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దుబాయ్‌ చేస్తున్నకృషిని ప్రశంసించారు. డీ33 అజెండా లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారం, పెట్టుబడులు, పర్యాటకంగా దుబాయ్‌ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ఈ చర్యలు దోహదపడతాయని డీపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ టూరిజం అభిప్రాయం పడింది. విలాసవంతమైన షాపింగ్‌, సాంస్కృతిక అనుభవాలు, కుటుంబ స్నేహపూర్వక ఆకర్షణలు, వ్యాపార సమావేశాలు వంటి వివిధ ప్రాధాన్యతలను అందిస్తూ దుబాయ్‌ విస్తృత శ్రేణి ప్రయాణికులను ఆకర్షిస్తుందన్నారు.


bottom of page