top of page

📅 మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు..

📍 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ గురువారం (ఫిబ్రవరి 29) సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 379 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏయే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయంటే..

ఆదిలాబాద్‌ జిల్లాలో పోస్టులు: 324

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోస్టులు: 447

హనుమకొండ జిల్లాలో పోస్టులు: 187

హైదరాబాద్‌ జిల్లాలో పోస్టులు: 878

జగిత్యాల జిల్లాలో పోస్టులు: 334

జనగాం జిల్లాలో పోస్టులు: 221

భూపాలపల్లి జిల్లాలో పోస్టులు: 237

గద్వాల జిల్లాలో పోస్టులు: 172

కామారెడ్డి జిల్లాలో పోస్టులు: 506

కరీంనగర్‌ జిల్లాలో పోస్టులు: 245

ఖమ్మం జిల్లాలో పోస్టులు: 575

ఆసిఫాబాద్‌ జిల్లాలో పోస్టులు: 341

మహబూబాబాద్‌ జిల్లాలో పోస్టులు: 381

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోస్టులు: 243

మంచిర్యాల జిల్లాలో పోస్టులు: 288

మెదక్‌ జిల్లాలో పోస్టులు: 310

మేడ్చల్‌ జిల్లాలో పోస్టులు: 109

ములుగు జిల్లాలో పోస్టులు: 192

నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టులు: 285

నల్లగొండ జిల్లాలో పోస్టులు: 605

నారాయణ్‌పేట్‌ జిల్లాలో పోస్టులు: 279

నిర్లల్‌ జిల్లాలో పోస్టులు: 342

నిజామాబాద్‌ జిల్లాలో పోస్టులు: 601

పెద్దపల్లి జిల్లాలో పోస్టులు: 93

సిరిసిల్ల జిల్లాలో పోస్టులు: 151

రంగారెడ్డి జిల్లాలో పోస్టులు: 379

సంగారెడ్డి జిల్లాలో పోస్టులు: 551

సిద్దిపేట జిల్లాలో పోస్టులు: 311

సూర్యాపేట జిల్లాలో పోస్టులు: 386

వికారాబాద్‌ జిల్లాలో పోస్టులు: 359

వనపర్తి జిల్లాలో పోస్టులు: 152

వరంగల్‌ జిల్లాలో పోస్టులు: 301

యాదాద్రి జిల్లాలో పోస్టులు: 277



Comments


bottom of page