top of page
MediaFx

పొద్దుపొద్దునే తాగుతూ రోడ్డుపై తందనాలు.. యువతి, యువకుడు అరెస్ట్🚓🍻

నాగోలులో శుక్రవారం ఉదయం ఓ యువతి, యువకుడు మద్యం మత్తులో హల్‌ చల్‌ చేసిన విషయం తెలిసిందే. స్థానిక ఫతుల్లాగూడ ఏరియాలో ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారు వారించారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వాళ్లిద్దరూ.. వాకర్స్‌తో ఘర్షనకు దిగారు. నోటికొచ్చింది మాట్లాడుతూ హడావిడి చేశారు. కారును వేగంగా నడుపుతూ భయాందోళనకు గురి చేశారు. వారి బాగోతాన్ని రికార్డు చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. ఫోన్లు లాక్కుంటూ దుర్భాషలాడారు. స్థానికుల సమాచారంతో… పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన నాగోలు పోలీసులు.. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. యువకుడు అలెక్స్‌‌తో పాటు యువతిపై పబ్లిక్‌ న్యూసెన్స్‌‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అని తెలిసింది.

bottom of page