3 నుంచి 4 శాతం తగ్గింపు..
కేంద్ర బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ నిబంధనలకు అనుగణంగా ఆపిల్ తన ఐఫోన్ల ధరను 3 నుంచి 4 శాతం తగ్గించింది. దిగుమతి సుంకం తగ్గడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో డిస్కౌంట్ ధరలతో ఐఫోన్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం ప్రో , ప్రో మాక్స్ మోడల్స్ రూ. 5100 నుంచి రూ. 6 వేలకు తగ్గాయి. అలాగే 13, 14, 15 తో సహా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు రూ. 300 తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ ఎస్ఈ ధర రూ. 2300 తగ్గింది. మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించిన తర్వాత ఆపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించింది.
కొనుగోళ్లు పెరిగే అవకాశం..
ఆపిల్ ఫోన్ల ధరలు తగ్గడం వల్ల కొనుగోళ్లు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర తీసుకున్న దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల మొబైల్ మార్కెట్ కు కొత్త ఉత్సాహాం వస్తుంది. మొట్టమొదటిసారిగా ఆపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడంతో గణనీయమైన మార్పు జరుగుతుంది. ముఖ్యంగా కొనుగోళ్లు బాగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఆపిల్ కొత్త వాటిని ప్రారంభించిన తర్వాత పాత ప్రో మోడళ్లను నిలిపివేస్తుంది. ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి డీలర్లు, పునఃవిక్రేతలచే ఎంపిక చేయబడిన డిస్కౌంట్లను మాత్రమే అందిస్తుంది. తగ్గిన కస్టమ్స్ డ్యూటీతో ఆపిల్ తన ప్రో మోడళ్లకు కొత్త ధర నిర్ణయించింది. దీని ప్రకారం ఐఫోన్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఐఫోన్ ఎస్ఈఆర్ రూ.49,900 నుంచి రూ.47,600లకు తగ్గింది.
ఐఫోన్ 13 ధర రూ.59,900 నుంచి 59,600కు అందుబాటులోకి వచ్చింది.
ఐఫోన్ 14 రూ. 69,900 నుంచి రూ.69,600లకు దిగిపోయింది.
ఐఫోన్ 14 ప్లస్ రూ. 79,900 నుంచి రూ.79,600కి అందుబాటులోకి వచ్చింది.
ఐఫోన్ 15 రూ. 79,900 నుంచి 79,600 తగ్గింది.
ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుంచి రూ.89,600 తగ్గింపు ధరకు లభిస్తుంది.
ఐఫోన్ 15 ప్రో రూ.1,34,900 నుంచి 1,29,800లకు తగ్గింది.
ఐఫోన్ 15 ప్రోమాక్స్ రూ.1,59,900 నుంచి రూ.1,54,000కు అందుబాటులో ఉంది.