top of page

నిలబడి నీళ్లు తాగుతున్నారా.. ఈ తప్పు అస్సలు చేయకండి.. 💧🚫

మీరు నీరు త్రాగడానికి ఎంచుకునే విధానం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదంలో నీరు త్రాగడానికి చిట్కాల గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, వీటిని శతాబ్దాలుగా అనుసరిస్తున్నారు.

నీరు.. మన శరీరానికి చాలా అవసరం ఎందుకంటే ఇది ముఖ్యమైన అవయవాలు సజీవంగా పనిచేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ, జీవక్రియ, బరువు తగ్గడం, నిర్వహణ వంటి ముఖ్యమైన శరీర భాగాలపై ప్రబావం చూపి అనేక అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల మలబద్ధకం, అలసట వంటి కడుపు సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నీరు తగిన మోతాదులో తాగితే అవయవాలను హైడ్రేట్ చేయడంతో పాటు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది. రక్తపోటు కీళ్ళను లూబ్రికేట్ చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తగినంత నీరు తాగకపోవడం పట్ల అనేక దుష్ప్రభావాలను కలిగి ఉన్నప్పటికీ, అయితే నీరు ఎలా తాగుతున్నామో అనేది కూడా ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం.. మీరు నీరు త్రాగడానికి ఎంచుకునే విధానం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదంలో నీరు త్రాగడానికి చిట్కాల గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, వీటిని శతాబ్దాలుగా అనుసరిస్తున్నారు.

నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు? 💧👍

నిలబడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆయుర్వేదం చెబుతోంది. దీన్ని తాగితే నీరు ఎంతో శక్తితో, వేగంతో శరీరంలోకి ప్రవేశించి నేరుగా కడుపులోకి వెళ్తుంది. ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అజీర్ణానికి కారణమవుతుంది. నిటారుగా నిలబడి నీరు తాగడం వల్ల కీళ్ళలో నీరు పేరుకుపోతుందని, దీనివల్ల ఆర్థరైటిస్ కూడా వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇక శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. ఎముకలు, కీళ్ళలో నొప్పి, మంటను ప్రేరేపించే టాక్సిన్ పేరుకుపోవడాన్ని పెంచుతుంది. కూర్చునే సమయంలో నీటిని తాగితేనే మానవ శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

కూర్చుని తాగండి : కూర్చున్న భంగిమలో ఉన్నప్పుడు తాగడం వల్ల కండరాలు, నాడీ వ్యవస్థ శాంతపరచడానికి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించదని, ఈ విధంగా వాటి వడపోత ప్రక్రియను సులభంగా చేయగలదని ఆయుర్వేదం చెబుతోంది.

ఇలా అస్సలు తాగొద్దు : పెద్ద మొత్తంలో నీరు తాగటం మానుకోండి. ఇది ప్రమాదానికి కారణం కావచ్చు, ఎందుకంటే నీరు శ్వాస నాళంలోకి చేరి అసౌకర్యానికి దారితీస్తుంది, ఇది మీ అవయవాలను కూడా షాక్ చేస్తుంది. నీరు తాగేటప్పుడు చిన్న సిప్స్ తీసుకుని శ్వాస తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువు తగ్గడానికి, నిర్వహణకు కూడా సహాయపడుతుంది.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page