ఎంతోమంది మహిళలకు కాస్మటాలజీ చదవడం, బ్యూటీషియన్లుగా కెరీర్ ప్రారంభించాలనుకోవడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ✨ కానీ కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో బ్యూటీషియన్లుగా పనిచేసే మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పుందని తేలింది. 👩🔬
వస్త్ర తయారీ, నిర్మాణ రంగం, సేల్స్, రిటైల్ పరిశ్రమల్లో పని చేసేవారికి కూడా ఈ ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. 💪 బ్యూటీని మరింత మెరుగుపరిచేందుకు వాడే పదార్థాలు అండాశయ క్యాన్సర్‌కు దారితీస్తాయని వెల్లడైంది. 🌈 🔬 ఎన్నో రకాల రసాయనాల తాకిడికి గురి కావడానికి, అండాశయ క్యాన్సర్ ముప్పుకు మధ్య ఉన్న సంబంధం ఈ పరిశోధనలో విశ్లేషించారు. 🧪 18-79 మధ్య ఏళ్ల, 1388 మంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు. వీరిలో 491 మందికి అండాశయ క్యాన్సర్ ఉంది. 💔 పది సంవత్సరాలకు పైగా పని చేస్తున్న హెయిర్ డ్రస్సుర్లు, నిర్మాణ రంగంలో ఉన్న మహిళలు, బ్యూటీషియన్లు 13 రకాల రసాయనాలకు ఎక్కువగా గురవుతుంటారని.. 💅 అందుకని వీరికి ముప్పు మూడింతలు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. 📚✨