top of page
Shiva YT

🚂🎫 Train టికెట్లు కావాలా నాయనా..?

22ఏళ్లే.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. పద్దతిగా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడో.. లేదో జాబ్ చేసుకుంటున్నాడో అనుకునేరు.. అబ్బే అదేంలేదు.. ఉన్న తెలివితో దోచుకోవడమే పనిగా ప్లాన్ చేశాడు.. చివరకు IRCTC వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి భారతీయ రైల్వే ప్రయాణికులకు బ్లాక్‌లో తత్కాల్ టిక్కెట్లను విక్రయించడం మొదలుపెట్టాడు. ఇలా రూ.15 లక్షలు సంపాదించాడు.. 💰💰

రైల్వే టికెట్ల అక్రమ దందా గురించి జూలై 26 న ప్రయాగ్‌రాజ్ సైబర్ క్రైమ్ విభాగం RPF దాద్రీని హెచ్చరించింది. నోయిడాకు అనుసంధానంగా ఉన్న అనుమానాస్పద IP చిరునామా, మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఒకే రోజులో అనేక తత్కాల్ టిక్కెట్లు బుక్ అవుతున్నాయని పోలీసులకు తెలిపింది. సైబర్ వింగ్ నుంచి అందిన సమాచారం ఆధారంగా, తాము సాంకేతిక విశ్లేషణ సహాయంతో నిందితుడిని ట్రాక్ చేసి అరెస్టు చేసామని దాద్రి రైల్వే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌కె వర్మ తెలిపారు. 👮🏻‍♂️🔍

ముఖ్యమైన తేదీలలో టికెట్లను బుక్ చేసిన ఆలం వాటిని అమ్ముకునేవాడని.. అలాంటివి 31 టికెట్లు ఉన్నాయని వాటి విలువ రూ.72,000 అని వర్మ తెలిపారు . రైల్వే టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా అతను గత రెండేళ్లలో దాదాపు రూ.15 లక్షల వరకు సంపాదించాడని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలం IRCTC వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన తర్వాత ఒకే క్లిక్‌లో ఆరు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించిన అక్రమ సాఫ్ట్‌వేర్ “Nexus”ని ఉపయోగిస్తున్నాడని తెలిపారు. 👮🏻‍♂️💻

bottom of page