top of page

🌴🏖 గోవా వెల్దామనుకుంటున్నారా..?

🌊🌅 గోవా ఎంతో అందంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్లిన వారికి మళ్లీ మళ్ళీ అక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది. అందుకే దేశంలోని అత్యధిక మంది ఇష్టపడే ఫస్ట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌గా గోవా నిలుస్తుంది. 🌴🌊 మీరు గతంలో ఎప్పుడూ గోవాకు వెళ్లకపోతే, ఈ హాలీడేస్‌లో గోవా టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? 🤔 అయితే, మీరు గోవాను దగ్గరగా చూడాలనుకుంటే..అక్కడ బైక్‌పై ట్రావెల్‌ చేయటం కంటే మెరుగైన ప్రయాణం మరొకటి ఉండదు. 🏍🏞 ఇక్కడ మీరు టాక్సీల కోసం వెచ్చించాల్సిన డబ్బు ఆదా చేసుకోవచ్చు. గోవాను దగ్గరగా చూసే అవకాశం కూడా లభిస్తుంది. 🚖🏝

🌊🏝 ఇక్కడ మీరు జెట్ స్కీయింగ్, స్కూబా డైవింగ్, విండ్‌సర్ఫింగ్, కయాకింగ్, పారాసైలింగ్ ఆస్వాదించే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఈ సాహస క్రీడలన్నింటిలో మీరు చాలా సరదాగా ఉంటారు. 🏄‍♂️🚣‍♂️ వాటిని మళ్లీ మళ్ళీ చేయాలనుకుంటే, మీరు ఇక్కడికి వెళ్ళండి. 🏝

🌊🚗 ఇక్కడి కోటల నుండి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఛపోరా ఫోర్ట్, అగోడా ఫోర్ట్, రైస్ మాగోస్ ఫోర్ట్ సాయంత్రాలు చాలా అందంగా ఉంటాయి. 🏰🌅 గోవాలో మీరు అరబ్, పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రెజిలియన్, ఆఫ్రికన్, చైనీస్, కొంకణ్, మలబార్ వంటి అన్ని రకాల ఆహార పదార్థాలను రుచి చూస్తారు. 🍛

🏞🦜 అయితే, గోవాలో బీచ్‌లు మాత్రమే కాకుండా కోటలు కూడా ఉన్నాయి. అక్కడ ఇంకా ఎన్నో ఇతర చూడదగ్గ ప్రదేశాలు, పురాతన కాలం నాటి శివాలయాలు, అడవులు -జలపాతాలు, అడ్వెంచర్ల కోసం ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. 🏞🌳 మీరు చరిత్ర ప్రేమికులైతే, మీరు ఖచ్చితంగా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడి కోటల నుండి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. 🌅✨

bottom of page