🛰️ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్.. చంద్రుని కక్ష్యలోకి ఎంటరైంది. ఇప్పటికే 5 దశల్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ నౌక.. ఇప్పుడు ఆరో దశగా భావిస్తున్న చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. సోమవారం అర్ధరాత్రి 12-1 గంటల మధ్య వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందులో ఆరు రోజుల పాటు ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. 👨🚀🛰️
🚀 సాధారణంగా టీఎల్‌ఐ ప్రక్రియలో రసాయన రాకెట్ ఇంజిన్‌లో నిర్దిష్ట పదార్థాలను మండిస్తారు. ఇది వ్యోమ నౌక వేగాన్ని పెంచుతుంది. ఈ వేగం వ్యోమ నౌక ప్రయాణించే కక్ష్యను అసాధారణ స్థాయికి తీసుకెళుతుంది. 🚀💨 🗓️ ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావాల్సి ఉంది. చంద్రయాన్-3.. చంద్రుడి కక్షలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం మరింత కీలకంగా మారింది. 🌕✨
🛰️ ఇక నుంచి వ్యోమ నౌక నుంచి ల్యాండర్ విడిపోవడం, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడం వంటి కీలక ఘట్టాలు జరుగుతాయి. ఈ ప్రయాణంలో వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండటం, అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్దితుల్ని దాటుకుంటూ నౌక ప్రయాణించాల్సి ఉంటుంది. 🌍👨🚀 🚀 కాబట్టి చంద్రుడి కక్షలో సవ్యంగా సాగడం, ఆ తర్వాత చంద్రుడిపైకి సురక్షితంగా ల్యాండ్ కావడం ప్రతీదీ సవాల్ గానే ఉండబోతోంది. భూమికీ, చంద్రుడికీ మధ్య దూరం 3.8 లక్షల కిలోమీటర్లు. ఇందులో ప్రతీ 1.2 లక్షల కిలోమీటర్ల ప్రయాణానికీ చంద్రయాన్-3కి పట్టే సమయం 51 గంటలు. అలాగే చంద్రయాన్ వెళ్లే రూటు ప్రకారం చూస్తే ఈ దూరం 3.6 లక్షల కిలోమీటర్ల నుంచి 4 లక్షల కిలోమీటర్ల మధ్యన కూడా ఉండొచ్చని అంచనా. చంద్రుడి కక్షలో సవ్యంగా సాగడం, ఆ తర్వాత చంద్రుడిపైకి సురక్షితంగా ల్యాండ్ కావడం ప్రతీదీ సవాల్ గానే ఉండబోతోంది. 🚀🌕