top of page

🌧️🌶️ వర్షానికి స్పైసి ఫుడ్ కి కనెక్షన్ ఏంటో తెలుసా ?


వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా..? 🌧️🌶️ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరం కారంగా ఉండే ఆహారాన్ని ఎందుకు కోరుకుంటుందో తెలుసా..? 🤔

శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల, స్పైసీ ఫుడ్ లో ఉండే కొన్ని ఆహార రసాయనాల వల్ల ఇలా స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుందట. వర్షాలు పడినప్పుడు, శీతాకాలంలో వాతావరణ చల్లగా మారిపోతుంది. అప్పుడు మసాలా ఆహారాన్ని తినాలన్న కోరిక శరీరంలో పుడుతుంది. స్పైసీ ఫుడ్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీరంలో వెచ్చదనాన్ని కలిగించి వేడి పుట్టిస్తుంది. అందుకే మన శరీరంలో చల్లని వాతావరణంలో స్పైసీ ఫుడ్‌ను కోరుకుంటుంది.

వర్షాకాలంలో మన శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరొటోనిన్ స్థాయులు తగ్గిపోతాయి. దానికి కారణం సూర్యరశ్మి లేకపోవడం.దీంతో శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. దీంతో వీటిని ఎడ్జెస్ట్ చేయటానికి మన శరీరం కార్బోహైడ్రేట్లు కావాలని కోరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరొటోనిన్ స్థాయుల్ని పెంచుతాయి. దీంతోపాటే డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ లో తేమ లేకుండా పొడిగా ఉంటాయి. నోట్లోవేసుకోగానే కరకరలాడతాయి. మన చుట్టూ ఉన్న చల్లని వాతావరణానికి ఈ ఆహారం తింటే మనకు నచ్చుతుంది. 😊🍴🥗🌞🍿🍜🌶️🥨🍟🍕🍔🍛🍱🍢🍣🍤🍥🥮🍡🥟🍦🍨🍧🍩🍪🎂🍰🧁🥧🍫🍬🍭🍮🍯🍿🍪🎂🍰🧁🥧🍫🍬🍭🍮🍯


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page