top of page
Suresh D

ఫ్రిడ్జ్‌లో నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుందా.. ఇలా వదిలించుకోండి!🏡🌿

ఫ్రిడ్జ్ అనేది మనిషి లైఫ్‌లో సగం భాగం అయిపోయింది. ఇప్పుడున్న కాలంలో ఫ్రిడ్జ్ కూడా ఒక నిత్యవసర వస్తువుగా మారింది. ఏ వస్తువు ఉన్నా లేకున్నా టీవీ, ఫ్రిడ్జ్ వంటివి మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. టీవీ వినోదం కోసం అయితే.. ఫ్రిడ్జ్ మాత్రం సౌకర్యం కోసం. ఈ ఫ్రిడ్జ్‌లో చాలా ఉపయోగాలు ఉన్నా.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ‌ ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లో ఒక్కటేంటీ.. అవసరం ఉన్నవి లేనివి అన్నీ కూరేస్తూంటారు. దీంతో ఫ్రిడ్జ్ నుంచి ఒక్కోసారి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన ఇతర ఆహార పదార్థాలపై కూడా పడుతుంది. దీంతో ఆ ఆహార పదార్థాలు కూడా చెడు వాసన వస్తూ ఉంటాయి.

ఫ్రిడ్జ్‌ని ప్రతి రోజూ శుభ్రం చేయాలంటే కష్టమనే చెప్పొచ్చు. అందుకే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే దుర్వాసన రాకుండా ఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఫ్రిడ్జ్ నుంచి వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చు. అవేంటో ఒక్కసారి చూసేయండి.

* ఫ్రిడ్జ్‌లో ఏలాంటి పదార్థాలు ఉన్నాయో రెండు రోజులకు ఒకసారి చెక్ చేసుకోవడం మాచింది. ఎందుకంటే ఒక్కోసారి పెట్టిన ఆహార పదార్థాలను మర్చిపోతూ ఉంటారు. కాబట్టి చెక్ చేసుకోవడం చాలా మంచిది. 

* కూరలు, దోశ పిండి లేదా ఇడ్లీ పిండి ఇలా ఎలాంటి వండిన పదార్థాలు పెట్టినా.. వాటిపై ఖచ్చితంగా మూతలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ వాసన ఫ్రిడ్జ్‌లో ఉంచి ఇతర వాటిపై కూడా ప్రభావం చూపిస్తుంది.

* వండిన ఆహార పదార్థాలను ఒక ట్రేలో.. వండని ఆహార పదార్థాలు మరో ట్రైలో పెట్టుకోవడం ఉత్తమం. దీని వల్ల ఇతర పదార్థాలు త్వరగా పాడవకుండా.. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉటాయి.

* బేకింగ్ సోడా అనేది ఒక మ్యాజిక్ పౌడర్ అని చెప్పొచ్చు. సన్న రంధ్రాలు ఉన్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి.. ఫ్రిడ్జ్‌లో ఒక మూలలో పెట్టడం మంచిది. ఇలా చేస్తే.. చెడు వాసన రాకుండా ఉంటుంది.

* ఫ్రిడ్జ్‌ను కనీసం నెలకు ఒకసారైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఫ్రిడ్జ్ శుభ్ర పడటమే కాకుండా.. చెడు వాసన రాకుండా ఉంటుంది. బ్యాక్టీరియా, క్రిములు స్ప్రెడ్ అవకుండా ఉంటాయి.

* ఫ్రిడ్జ్‌ని శుభ్రం చేయాలంటే.. ఒక స్పూన్ వంట సోడా, స్పూన్ డిష్ వాష్ లిక్విడ్, రెండు కప్పుల నీళ్లు పోసి.. సపరేట్‌గా ఒక లిక్విడ్ సిద్ధం చేసుకోవలి. ఈ లిక్విడ్‌తో ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసి.. పొడి వస్త్రంతో తుడిస్తే మరకలు, దుర్వాసన పోతుంది.🏡🌿

bottom of page