top of page

🌐📰 సీఎం మమతా వ్యాఖ్యలతో ఏకిభవిస్తున్నా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 🗣️📢

👥🔍కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని ఎన్నికల సమయంలో తాము చెప్పిన విషయం కేవలం 60 రోజుల్లోనే రుజువైందంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌.. కాంగ్రెస్ పై మరోసారి మాటలతూటాలు సంధించారు. కాంగ్రెస్‌ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. మార్చి 17తో కాంగ్రెస్‌ సర్కార్‌కి వందరోజుల కాలం పూర్తవుతుందని, మరి 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు అయ్యాయో.. ప్రజలు గ్రహించాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 👥🔍హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు ప్రజలు పట్టంకట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళు చేసే పని గుర్తుకొస్తుందనున్నారు. ఇచ్చిన మోసపూరిత హామీలతో కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిందని.. పదేళ్లలో కరెంట్ పోలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుందంటూ ఫైర్ అయ్యారు. డిసెంబర్9న రైతులు లోన్లు తెచ్చుకోమన్నారు.. ఇప్పటి దాకా రుణమాఫీ చేయలేదని కేటీఆర్ గుర్తుచేశారు. డిసెంబర్ 9, జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9వచ్చింది ఇంకా రుణమాఫీ కాలేదంటూ విమర్శించారు. 🗞️🗳️కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ కాంగ్రెస్ పార్టీ పైన బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నదని.. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

bottom of page