top of page
MediaFx

వేసవిలో కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా.?

సాధారణ రోజులతో పోల్చితే వేసవిలో కూరగాయలు త్వరగా పాడవుతాయి. దీనివల్ల కూరగాయల రుచిని పాడుచేయడమే కాకుండా వాటి పోషకాలను తగ్గిస్తుంది. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడ ద్వారా కూరగాయలను ఎక్కువగా తాజాగా ఉంచుకోవచ్చు. ఇంతకీ కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కూరగాయలను నిల్వ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కూరగాయలను కడిగిన తర్వాత వాటిని ఎల్లప్పుడూ పొడిగా ఉంచాలి. తడిగా ఉంటే కూరగాయలు త్వరగా పాడవుతాయి. అందుకే కూరగాయలపై నీరు లేకుండా పూర్తిగా తూడ్చేయ్యాలి. పూర్తిగా ఆరిన తర్వాత వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇక రిఫ్రిజిరేటర్ టెంపరేచర్‌ ఎల్లప్పుడూ.. 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ఈ టెంపరేచర్‌లో ఉంటేనే కూరగాయలు తాజాగా ఉంటాయి.

దీనివల్ల ఎక్కువ కాలం తాజాగా ఉండడంతో పాటు వాటి రుచి, పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇక కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. వాటిని ఒకదానిపై ఒకటి పేర్చవద్దు. దూరం దూరం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కూరగాయలకు గాలి తాకడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇక టమోటో, దోసకాయ వంటి కొన్ని కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు.

ఇలాంటి వాటిని గది ఉష్ణోగ్రత వద్దే స్టోర్ చేసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా కూల్‌ ఉన్న వాతావరణంలో ఉంచితే, త్వరగా పాడవుతాయి. కాబట్టి వాటిని సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అలాగే కూరగాయలను స్టోర్‌ చేసే సమయంలో వాటిని పేపర్‌లో చుట్టాలి. ఇలా చేయడం వల్ల కూరగాయల్లో ఉండే అదనపు తేమను గ్రహిస్తుంది దీంతో కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కూరగాయలు తాజాగా ఉంటాయి.

bottom of page