హీరో రామ్ పోతినేని పూరి జగన్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో రామ్ బిజీగా ఉన్నాడు. మొన్నటివరకూ ఈ చిత్రం షూటింగ్ ఆర్థిక సమస్యల కారణంగా చాలా కాలం పాటు ఆగిపోగా కొన్ని రోజుల క్రితమే ముంబైలో మళ్లీ మొదలైంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మరోవైపు రామ్ గురించి రెండు క్రేజీ న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ పోతినేని నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ జోనర్‌లో రాబోతుంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు రామ్ చర్చలు జరుపుతున్నాడట. ఇందుకోసమే కొద్దిరోజుల క్రితం రామ్.. హరీష్ శంకర్‌ని కలిసి స్క్రిప్ట్ కూడా విన్నాడట. అతి త్వరలోనే ఈ కాంబో ఓకే అయ్యే అవకాశం ఉంది.
వరుస ఫ్లాపులతో చాలా కాలంగా రామ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. 2019లో పూరి జగన్నాథ్‌తో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకూ రామ్‌కి మరో హిట్ దక్కలేదు. ఆ తర్వాత చేసిన రెడ్, ది వారియర్, స్కంద చిత్రాలు ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేసిన స్కంద సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు రామ్. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో సినిమాను గట్టిగానే పైకి లేపే ప్రయత్నం చేశాడు బోయపాటి. కానీ ఆడియన్స్ మాత్రం నిరాశ చెందారు. అయితే థియేటర్లో ఫ్లాప్ అయిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం సూపర్ వ్యూయర్ షిప్ దక్కించుకోవడం కొసమెరుపు. మరి డబుల్ ఇస్మార్ట్‌తో రామ్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్ కూడా లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. పూరికి కూడా హిట్టు కొట్టక తప్పని పరిస్థితి ఉంది. అందుకే చాలా పకడ్బందీగా ఈ చిత్రాన్ని తీస్తున్నాడు పూరి. ఇప్పటికే కొంత వరకూ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు .