top of page
Shiva YT

📱🔍🕵️‍♂️ ఎట్టి పరిస్థితుల్లో గూగుల్లో దీనిని మాత్రం సెర్చ్ మాత్రం చేయొద్దు📱🔍🕵️‍♂️

🕵️‍♂️సాధారణంగా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే కస్టమర్ కేర్ కు కాల్ చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో కస్టమర్ కేర్ నంబర్ తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే గూగుల్ లోకి వెళ్లి సంబంధిత కస్టమర్ కేర్ నెంబర్ అని టైప్ చేసి చూస్తాము… ఇదే సైబర్ నేరగాళ్లకు దొరికే వరం. గూగుల్ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా లక్షల పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ఫ్రాడ్ నెంబర్‌ని క్రియేట్ చేసి అదే కస్టమర్ కేర్ నెంబర్‌గా బోల్తా కొట్టించి.. కొంతమంది సైబర్ కేటుగాళ్లు గూగుల్ లోకి దూరి బాధితుల జేబుకు చిల్లు పెడుతున్నారు. 📱🔍🕵️‍♂️🕵️‍♂️ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. 📱🔍🕵️‍♂️

🕵️‍♂️ బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ చేసి 2 లక్షలు క్షణాల్లో పోగొట్టుకున్న హైదరాబాది యువతి 📱🔍🕵️‍♂️

🕵️‍♂️ హైదరాబాద్ కు చెందిన ఒక యువతి బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ లో వెతికింది. గూగుల్ లో ఇదే బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నెంబర్ అంటూ ఒక నంబర్ కనిపించింది. దీంతో సోదరి యువతీ ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి తన సమస్య చెప్పింది. నిజమైన బ్యాంకు కస్టమర్ కేర్ గా బాధితురాలని నమ్మించారు సైబర్ ఫ్రాడ్ స్టర్స్. బాధితురాలికి ఒక లింకు పంపించి దాన్ని క్లిక్ చేసి ఓటీపీ చెప్పమని కోరారు. అది మోసపూరిత వ్యవహారం అని తెలియని యువతి కేటగాళ్లు చెప్పిన విధంగా ఓటిపిల్లు చెప్పడంతో యువతి బ్యాంక్ ఖాతా నుండి 2 లక్షలు కట్ అయ్యాయి.. ఇది సైబర్ నేరగాళ్లు మోసమని గ్రహించిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 📱🔍🕵️‍♂️

bottom of page