top of page

పిల్లలకు ఆశ్లీల కంటెంట్‌ కనిపించొద్దంటే..


బ్రౌజింగ్‌ చేస్తూ వెళ్తున్న సమయంలో చిన్నారులకు తమకు తెలియకుండానే ఆశ్లీల కంటెంట్‌ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది చిన్నారుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే చిన్నారులు ఫోన్‌ చూసే సమయంలో పెద్దలకు సంబంధించిన కంటెంట్‌ కనిపించకూడదంటే స్మార్ట్‌ ఫోన్‌లో కొన్ని రకాల సెట్టింగ్స్‌ చేంజ్‌ చేసుకోవాలి. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * ఇందుకోసం ముందుగా ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. * తర్వాత ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ కోసం సెర్చ్‌ చేయండి. ‘ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌’ అని టైప్ చేసి సెర్చ్‌ చేయాలి.

* ప్రైవేట్‌ డీఎన్‌ఎస్‌ను క్లిక్‌ చేయాలి. క్రియేట్‌ ప్రైవేట్ DNSని సెలక్ట్‌ చేసుకోవాలి. సెటప్‌ డీఎన్‌ఎస్‌ బాక్స్‌లో ‘family.adguard-dns.com’ అని టైప్ చేసి సేవ్ చేయండి.

* ఇలా చేయడం ద్వారా మీ చిన్నారుల ఫోన్‌లలో పెద్దలకు సంబంధించిన కంటెంట్ మొత్తం బ్లాక్ అవుతుంది. పొరపాటున కూడా అలాంటి కంటెంట్‌ వారికి కనిపించదు.

గూగల్‌ కిడ్స్‌ స్పేస్‌..

అడల్ట్‌ కంటెంట్‌కు అడ్డుకట్ట వేయడానికి గూగుల్‌ కిడ్స్‌ స్పేస్‌ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై ‘డిజిటల్ వెల్‌బీయింగ్’ ఆపై ‘పేరెంటల్ కంట్రోల్’ సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీ చిన్నారుల ఆన్‌లైన్‌ సర్ఫింగ్‌పై నిఘా ఉంచవచ్చు.

యాప్‌ పిన్నింగ్ ఫీచర్‌..

మీ పిల్లలు ఒకే యాప్‌ని ఉపయోగించాలనుకుంటే ఫోన్‌లో ‘యాప్ పిన్నింగ్’ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ పిన్నింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు పిన్‌ చేసిన యాప్‌ను మాత్రమే మీ చిన్నారి ఉపయోగించేలా పర్మిషన్‌ ఇస్తుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page