top of page
Suresh D

ఇంట్లో నల్లా నీళ్లు పట్టేటప్పుడు ఇలా చేస్తే జైలుకే.! 🚱



జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. 🚱 కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. 🚰 దీని వల్ల మిగిలిన వినియోగదారులకు.. లో- ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతోంది. 🚱 ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 🔍 ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. 🛠️ కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. 📢 ఒకవేళ తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. 📞 లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 📞 వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు. 🔧

bottom of page