top of page
Suresh D

బాలీవుడ్ లో టాలీవుడ్ మూవీస్ డామినేషన్.. 🎬✨

ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు పాన్ ఇండియన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాల మొదలుకొని ఈ ఏడాది రిలీజ్ అయిన హను మాన్ వరకు అన్ని సినిమాలు సౌత్ తో పాటు నార్త్ లో సైతం బాగానే కలెక్షన్ రాబట్టాయి.

ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన కల్కి 2898 ఏడి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర పార్ట్ 1 మూవీస్ యొక్క నార్త్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ భారీ ధరకు దక్కించుకున్నారు.‘పుష్ప 2’ 200 కోట్లుతో ఆల్ టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది . ప్రభాస్ నటించిన కల్కి 2898 AD హిందీ హక్కులు కూడా 100 కోట్లకు అమ్ముడయ్యాయి. బాలీవుడ్ మీడియాలో తాజా అప్‌డేట్ ప్రకారం, రామ్ చరణ్ యొక్క గేమ్ ఛేంజర్ హిందీ థియేట్రికల్ రైట్స్ పరంగా ఎన్టీఆర్ యొక్క దేవరను అధిగమించింది.గేమ్ ఛేంజర్ హిందీ థియేట్రికల్ రైట్స్ ద్వారా 75 కోట్లు రాబట్టగా, దేవర 50 కోట్లు రాబట్టాడు. మొత్తంగా ఇవన్నీ కలిపి రూ. 425 కోట్ల మేర అక్కడ బిజినెస్ జరుపుకున్నాయి.

దీనిని బట్టి ఈ మూవీస్ అన్ని కూడా నార్త్ మార్కెట్ లో గట్టిగానే డామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల యానిమల్ మినహా రిలీజ్ అయిన పలు హిందీ సినిమాలు ఏవి కూడా భారీ విజయాలు అందువుకోలేదనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో మన ఈ టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీస్ అన్ని కూడా ఏ స్థాయి సక్సెస్ సక్సెస్ ని కలెక్షన్ ని సొంతం చేసుకుని అక్కడి ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి.


bottom of page