top of page

శీతాకాలంలో మీ స్కిన్ డార్క్ అవుతుందా.. వీటితో చెక్ పెట్టండి!🏡❄️

శీతా కాలంలో ఆరోగ్య పరంగానే కాకుండా.. శరీరంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. చర్మం తన సహజ రంగును కోల్పోయి.. కాస్త డార్క్ గా కనిపిస్తుంది. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. అందులోనూ డ్రై స్కిన్ ఉన్న వారికి ఇది మరీ పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలతో ఈ డార్క్ స్కిన్ ని.. సాధారణ రంగులోకి మార్చవచ్చు.

శీతా కాలంలో ఆరోగ్య పరంగానే కాకుండా.. శరీరంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. చర్మం తన సహజ రంగును కోల్పోయి.. కాస్త డార్క్ గా కనిపిస్తుంది. ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. అందులోనూ డ్రై స్కిన్ ఉన్న వారికి ఇది మరీ పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలతో ఈ డార్క్ స్కిన్ ని.. సాధారణ రంగులోకి మార్చవచ్చు. అంతే కాకుండా ఇవి స్కిన్ కి సహజమైన మెరుపు తీసుకొస్తాయి. దీంతో బ్యూటీ పార్లర్స్ కి కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. మరి ఆ ఇంటి చిట్కాలు ఏంటి? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బేబీ ఆయిల్:

బేబీ ఆయిల్ ని కేవలం చిన్న పిల్లలే కాకుండా.. మీ చర్మాన్ని కాపాడు కోవడానికి కూడా మీరు ఉపయోగించు కోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు కాబట్టి.. వీటిల్లో కెమికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో చర్మానికి హాని చేసేవి ఏమీ ఉండవు. ఈ ఆయిల్ తో చర్మాన్ని మర్దనా చేసుకున్న అరగంట తర్వాత.. గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే.. సాఫ్ట్ గా కాంతి వంతంగా తయారవుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్ తో మీ డార్క్ స్కిన్ ని మార్చుకోవచ్చు. ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ని నేరుగా కాకుండా.. కాటన్ సహాయంతో చర్మంపై అప్లై చేయాలి. తర్వాత కాటన్ తో మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తే.. స్కిన్ క్లీన్ గా ఉంటుంది. అంతే కాకుండా చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగి పోతాయి. 

బేకింగ్ సోడా:

టాన్ ని వదిలించుకోవడానికి బేకింగ్ సోడా కూడా బాగా పని చేస్తుంది. టాన్ ను తొలగించు కోవడానికి ఎప్పటి నుంచో బేకింగ్ సోడాను యూజ్ చేస్తూ ఉంటారు. నీటిలో బేకింగ్ సోడా వేసి పేస్ట్ లా చేసి దానిని చర్మంపై అప్లై చేయవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉంటే నిమ్మ రసంతో కలిపి అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను స్కిన్ పై కాసేపు ఉంచి స్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

నిమ్మ రసం:

నిమ్మ కాయలో సిట్రిక్ యాడిస్ ఉంటుంది. ఇది చర్మాని డి-టాన్ చేయడంలో బాగా పని చేస్తుంది. ఇది చర్మం కలర్ ను కాంతి వంతంగా తయారు చేస్తుంది. పిగ్మెంటేషన్, టాన్ తో బాధ పడేవారికి నిమ్మ కాయ బాగా పని చేస్తుంది. ఫ్రెష్ గా కట్ చేసిన నిమ్మ కాయను తీసుకుని.. ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి. మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా రుద్దాలి. ఇలా చేస్తే మీ స్కిన్ ఎక్స్ ఫోలియేట్ అవుతుంది.🏡❄️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page