top of page
Shiva YT

కాస్త డిఫరెంట్ గా ఉంటే ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ అవుతుంటాయి..

ప్రతి సినిమాలో అనేక డ్రెస్సులు వాడతారు. ఒకవేళ అవి కొత్తగా.. కాస్త డిఫరెంట్ గా ఉంటే ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. గతంలో మగధీర చిత్రంలో కాజల్ ధరించిన వైట్ అండ్ డ్రెస్ అప్పట్లో ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు కాలం మారింది. హీరోహీరోయిన్స్ ఉపయోగించిన స్టైల్ కాస్ట్యూమ్స్ క్షణాల్లో సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి.

సాధారణంగా సినిమాల్లో హీరోహీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తుంటారు. పాత్రకు తగినట్టుగా వారి మేకోవర్ మారిపోతుంటుంది. కేవలం గ్లామర్ షోలే కాకుండా.. మాస్ లుక్స్‏లో సైతం ఆకట్టుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతి సినిమాలో అనేక డ్రెస్సులు వాడతారు. ఒకవేళ అవి కొత్తగా.. కాస్త డిఫరెంట్ గా ఉంటే ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. గతంలో మగధీర చిత్రంలో కాజల్ ధరించిన వైట్ అండ్ డ్రెస్ అప్పట్లో ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు కాలం మారింది. హీరోహీరోయిన్స్ ఉపయోగించిన స్టైల్ కాస్ట్యూమ్స్ క్షణాల్లో సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా.. అలాంటి డ్రెస్సులను స్వయంగా డిజైనర్స్ ద్వారా రెడీ చేయించుకుంటున్నారు. అయితే సినిమాల్లో సెలబ్రెటీలు ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ఆ తర్వాత ఏం చేస్తారో అని ఎప్పుడైనా ఆలోచించారా ?.. ఆ ఇంతకీ ఆ బట్టలన్నింటిని ఏం చేస్తారో తెలుసుకుందామా.మూవీస్ లో హీరోహీరోయిన్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్ వాళ్లకు నచ్చితే వాటిని తమతో తీసుకెళ్తారట. ఇక మరికొన్నింటిని వేలం వేస్తారట. గతంలో దూకుడు సినిమా కోసం సమంతకు.. మహేష్ బాబుకు ప్రత్యేకంగా కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. మూవీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని వేలం వేయగా వచ్చిన మనీని సామ్ చారిటీకి ఉపయోగించింది. అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ వాడిన పోలీస్ కాస్ట్యూమ్ ను ఒక స్వచ్చంద సంస్థకు సాయం చేయడం కోసం వేలం వేశారు.



bottom of page