top of page
MediaFx

పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఇలా చేయండి..


చీరలు అంటే ఆడువారికి ప్రాణమనే చెప్పాలి. ఎన్ని చీరలు ఉన్నా.. ఇంకా ఇంకా కొత్త చీరలను కొంటూనే ఉంటారు. అయితే పట్టు చీరలకు మరింత ప్రత్యేకత ఉంది. పట్టు చీరలు కడితే మహిళల అందం మరింత రెట్టింపు అవుతుందనే చెప్పాలి. పట్టు చీరలు చాలా ఖరీదు. ఇతర చీరలతో పోల్చితే వీటిని తక్కువగానే తీసుకుంటారు. ఇలా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే పట్టు చీరలు త్వరగా పాడైపోతాయి అంటూంటారు. ఎంత రేటు పెట్టి కొన్నా.. వీటిని ధరించే సమయంలోనే కాస్త జాగ్రత్తలు వహించాలి. పట్టు చీరలు కాస్త డెలిగేట్‌గా ఉంటాయి. సాధారణ చీరల్లాగా మడత పెట్టలేం. ఎలా పడితే అలా ఉతకకూడదు. సరిగా ఉతకకపోతే త్వరగా పాడైపోతాయి. కాబట్టి పట్టు చీరల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎన్ని సంవత్సరాలు అయినా.. పట్టు చీరలు కొత్తగా కనిపించాలి అంటే.. ఈ జాగ్రత్తలు తీసుకుని.. చిట్కాలు ట్రై చేయండి. బయట నుంచి వచ్చాక..

చాలా మంది బయట నుంచి వచ్చాక పట్టు చీరల్ని పక్కకు పడేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. వాటిని తీసి గాలికి ఆరనివ్వాలి. అప్పుడే వాటికి పట్టిన చెమట వాసన అనేది బయటకు పోతుంది. అప్పుడు మీరు దాన్ని మడత పెట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే పట్టు చీరల్ని డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి. మనం ఉతికితే చీరలకు ఉన్న జరీ మొత్తం ఊడి వస్తుంది. దీంతో చీరలు త్వరగా పాడైపోతాయి. పట్టు చీరల్ని అస్సలు ఎప్పుడూ వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడదు.

ఇలా మడత పెట్టండి:

చాలా మంది పట్టు చీరల్ని మడత పెట్టి అలానే ఉంచేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా పట్టు చీరలు త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. పట్టు చీరల్ని ఎప్పుడూ ఒకే మడతలో ఉంచకూడదు. మడతలు మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ మార్చుతూ ఉండాలి. పేపర్ లేదా సపరేట్ కవర్‌‌లో ఉంచాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తే.. పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి.

bottom of page