top of page

ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..


కలశాన్ని ఈ దిక్కులో ఉంచండి:

ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి కలశానికి ఉంది. ఈశాన్య మూలలో కలశాన్ని ఉంచి వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలని, కలశాన్ని ప్రతిష్టించి వినాయకుడిని పూజిస్తే నెగిటివ్ శక్తి తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ నీటిని మొక్కలకు వేయవచ్చు.

ఉప్పు:

నెగిటివ్ శక్తిని తొలగించడంలో ఉప్పు ఎంతో చక్కగా సహాయ పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీళ్లతో తుడవడం, ఉప్పును మీ ఇంటి మూలల్లో వేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం:

ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ చిట్కా కూడా చక్కగా సహాయ పడుతుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రం పెట్టండి. ఈ ఫొటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.

కర్పూరం:

కర్పూరంతో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ సాయంత్రం కర్పూరాన్ని వెలిగించి.. ఇంటి మూలలో, ఇంటి ప్రవేశ ద్వారానికి చూపించండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ధూపం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

Comments


bottom of page