top of page
MediaFx

ముఖంపై ముడతలు వస్తున్నాయా.? ఇలా చేస్తే వారం రోజుల్లోనే మార్పు..!


వయసు పెరుగుతన్న కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే చర్మంపై ముడతలు లేకుండా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సహజ పద్ధతుల్లో కూడా చర్మంపై ముడతల సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజ పద్ధతుల్లో చర్మంపై వచ్చిన ముడతలను తగ్గించుకోవడానికి మీ ముఖానికి అవసరమైనంత పెసర పిండి తీసుకొని, దానిలో తేనె, ఆవ నూనె, రోజ్‌ వాటర్‌ కలిపి ఓ పేస్టులా తయారు చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కొని ఈ పేస్టును అప్లై చేయాలి. ఓ 15 నిమిషాలపాటు ఈ ప్యాక్‌ ను ముఖంపై ఉంచి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. కడిగే సమయంలో ముందుగా ముఖంపై చల్లని నీటితో తడిపి వృత్తాకారంలో మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా ముఖాన్ని శుభ్రం చేసుకునే సమయంలో అలోవెరా జెల్‌ కూడా ఉపయోగించుకోవచ్చు.

bottom of page