top of page
MediaFx

గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!


మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ చురుకుగా ఉత్సాహంగా ఉండాలి. అందుకు నడక, యోగా, వ్యాయామం బాగా ఉపయోగపడతాయి. దీంతోపాటుగా కొన్ని చిన్న అలవాట్లు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం.. అవును, మీరు సరిగ్గానే విన్నారు.. మెట్లు ఎక్కడం వల్ల అది మీ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుంది.. అయితే గుండె దృఢంగా ఉండటానికి గుండెపోటును నివారించడానికి ఉత్తమ మార్గం ప్రతిరోజూ మెట్లు ఎక్కడం.. అయితే.. రోజూ ఎన్ని మెట్లు ఎక్కాలి..? అధ్యయనం ఏం చెప్పింది..? గుండెపోటును నివారించడానికి మార్గం.. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం ఉత్తమమని దీనిద్వారా గుండె సిరలు బలంగా మారడం ప్రారంభమవుతుందని అధ్యయనం పేర్కొంది. తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెట్లు ఎక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువ. జిమ్‌కి వెళ్లడానికి లేదా ఎక్కువసేపు నడవడానికి మీకు సమయం దొరకకపోయినా, భయపడాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తుంది. మీరు సులభమైన మార్గాల్లో మీ హృదయాన్ని కూడా భద్రంగా చూసుకోవచ్చని పరిశోధనలో తెలిపింది.

bottom of page