సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. రోజుకు ఎన్నో వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. కానీ అందులో నిజం ఎంతుంది.. అన్న విషయాన్ని చాలా మంది విస్మరించి మోసపోతున్నారు. అందులో ఒక వార్త ఈ మధ్య కాలంలో వైరల్ అవుతోంది.
ఇది తెలుసుకున్న కొంత మంది ఈ వార్త నిజమేమోనని నమ్మి సగం ట్యాంకు మాత్రమే ఫిల్ చేస్తున్నారు. మరికొందరేమో అవన్నీ రూమర్స్ అని కొట్టేస్తున్నారు. అయితే ఈ వార్త అసలు నిజమా, కాదా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మీ వాహనంలో గరిష్ట పరిమితి వరకు పెట్రోల్ నింపవద్దని వస్తోన్న వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తనిఖీ చేపట్టింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పందించిందని, శీతాకాలం లేదా వేసవితో సంబంధం లేకుండా పరిమితి (గరిష్టంగా) వరకు వాహనాల్లో ఇంధనాన్ని నింపడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. ఈ రకమైన వార్తలు ఎవరూ నమ్మవద్దని, ఐవోసీఎల్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని చెబుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు తెలిపారు.