Viral Video: కరీంనగర్ (Karimnagar) డిమార్ట్ రెండు రోజులుగావినియోగదారుల నిలువు దోపిడీపై ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులకు కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో డిమార్డ్ షోరూం (Dmart Show Room) లో బుధవారం ఉదయం లీగల్ మెట్రాలాజి విభాగం అధికారుల బృందాలు తనిఖీలు చేపడుతోంది. వినియోగదారుల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు జరుగుతుండడం విశేషం.అయితే డిమార్ట్ (DMart) లో జరుగుతున్న వ్యవహారంపై ఆగ్రహించిన కన్జ్యూమర్లు షోరూం దగ్గరకు వెల్లి నిరసన తెలిపారు. వారు కొనుగోలు చేసిన వస్తువుల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకుని అవి ఎక్కువగా కొన్నట్టుగా బిల్లులు వేస్తూ తమను నిలువు దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.ఎక్కువ రకాల సామాగ్రి కొనుగోలు చేసిన వినియోగదారులకు ఇలా బిల్లులు వసూలు చేసి ఎక్కువ డబ్బులు పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వినియోగదారులతో కిక్కిరిసి పోయే కార్పోరేట్ షోరూంలలో వస్తువులు కొనుగోలు చేసిన తరువాత క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇంటికి వెళ్లి చూసుకుంటున్న కన్జ్యూమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువులకన్నా ఎక్కువ బిల్లు చెల్లించామని గుర్తిస్తున్నారు.