ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. “రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇందులో తేజా సజ్జా, అమృతా అయ్యార్ హీరోహీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. విుడదల కంటే ముందే ప్రీమియర్స్తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లతో దూసుకుపోతుంది. రోజు రోజుకీ ఈ సినిమాకు మరింత ఆదరణ లభిస్తుంది. ఇక నార్త్ లో ఈ మూవీకి అత్యధిక రెస్పాన్స్ వస్తుంది. విడుదలై నాలుగు రోజులు దాటుతున్నా థియేటర్లు మాత్రం హౌస్ ఫుల్ అవుతున్నాయి. నాలుగో రోజు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లోనూ రూ. 24 కోట్లతో మొత్తంగా రూ.97 కోట్ల గ్రాస్ సాధించింది. తాజాగా ఈ చిత్రం సలార్ రికార్డ్ బ్రేక్ చేసింది.
ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. “రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అటు హనుమాన్ సినిమాకు హిందీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉత్తరాదిలో ఇప్పటివరకు రూ.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అటు అమెరికాలోనూ హనుమాన్ సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అమెరికాలో మొదటి వారంలోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టి సలార్, బాహుబలి రికార్డ్స్ దాటేసింది హనుమాన్.