top of page

దిల్ రాజు కొడుకు అప్పుడే యాక్టింగ్ కూడా చేసేశాడు..

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఇటీవల తన కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.


హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన అన్వై బర్త్‌ డే వేడుకలకు పలువురు సినీ ప్రముఖు హాజరయ్యారు. దిల్‌రాజు కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి- సురేఖ దంపతులు, మహేశ్‌ బాబు, వెంకటేశ్‌, గోపీచంద్‌, శ్రీలీల, రాశీఖన్నా, సురేష్ బాబు, త్రివిక్రమ్, వక్కంతం వంశీ తదితరులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అన్వైను ఆశీర్వదించారు. కాగా తన కుమారుడి బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించారు దిల్‌రాజు. ఇందుకోసం మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ ప్రత్యేకంగా ఓ పాటను కూడా కంపోజ్‌ చేశాడు. ప్రముఖ సింగర్‌ కార్తిక్‌ ఈ పాటను ఆలపించారు. ఇటీవలే యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page