అలియాభట్ భర్త రణ్‌బీర్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ వార్తలపై అలియా క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, అలియా భట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు అలియా బదులిచ్చారు. ఇందులో భాగంగానే తన వైవాహిక జీవితంపై వచ్చిన పుకార్లపై అలియా స్పందించింది.
ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో నాపై కొన్ని పుకార్లు వచ్చాయి. నేను సన్నగా మారడానికి, తెల్లగా అవ్వడానికి సర్జరీలు చేయించుకున్నారి దుష్ఫ్రచారం చేశారు. అలాగే నా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయంటూ పుకార్లు వచ్చాయి. అయితే వీటిలో ఏవీ నిజం లేదు. అందుకే నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి పుకార్లు నన్ను బాధించవు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
ఇక రణ్‌బీర్ కపూర్ అలియాను వేధించాడంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించింది. ఈ విషయమై అలియా మాట్లాడుతూ.. ‘గతంలో ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌కు నా లిప్‌స్టిక్ నచ్చదని తెలిపాను. లిప్‌స్టిక్ తీసేయమంటాడు అని చెప్పాను. దాంతో ఆ విషయాన్ని తప్పుగా ప్రచారం చేశార. రణ్‌బీర్ నన్ను వేధిస్తున్నాడంటూ వార్తలు రాశారు. 🌐💑💔