top of page

ఏంటక్కా.. పాము అనుకున్నావా.. పొట్లకాయ అనుకున్నావా?


పాము ఓ ఇంట్లోకి దూరింది. పామును చూసిన ఓ అమ్మాయి.. ఏమాత్రం భయ పడుకుండా దాన్ని పట్టుకుని దానితో ఆటలాడటం మొదలు పెట్టింది. పామును పట్టుకుని గిరా గిరా మని తిప్పుతూ ఉంది. అది చూసిన చుట్టు ప్రక్కల జనం ఎంతో భయ పడ్డారు. ఇంటి నుంచి బయటకు రాగానే ఆ పామును జనంలో తిప్పుతూ ఉంది. వర్షం కూడా గట్టిగానే పడుతుంది. ఆ వానలో ఆ అమ్మాయి పాముతో ఫీట్లు చేస్తుంది. చివరికి ఆ పామును ఓ సంచిలో వేసి మూట గట్టి.. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ మళ్లీ పాముతో ఆట ఆడి.. తిరిగి అక్కడ వదిలిపెట్టింది. ఈ వీడియో చూస్తుంటే ఇది అంతా కావాలనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కావాలనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ‘అది పామునా లేక రబ్బరు పామునా ఆడుకుంటున్నావ్’.. ‘హే క్యూటీ.. అది ఒక్క కాటే వేస్తే నీ బ్యూటీ మటాష్’.. ‘ఆ పాముకు విషం తీసేశారనుకుంటా.. అందుకే ధైర్యంగా ఆడుతుంది’ అంటూ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.




Komentarze


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page