top of page

తెలుగులో రిలీజ్ కాబోతున్న ‘కెప్టెన్ మిల్లర్’..

తమిళంలో సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది ఈ సినిమా. కానీ తెలుగులో మాత్రం విడుదల కాలేదు. ఎందుకంటే.. ఈసారి సంక్రాంతికి తెలుగులోనే చాలా ఎక్కువ సినిమాలు విడుదల కావడమే. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయకుండా కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటేస్ట్ సినిమా కెప్టెన్ మిల్లర్. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్, యోగి బాబు, శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది ఈ సినిమా. కానీ తెలుగులో మాత్రం విడుదల కాలేదు. ఎందుకంటే.. ఈసారి సంక్రాంతికి తెలుగులోనే చాలా ఎక్కువ సినిమాలు విడుదల కావడమే. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయకుండా కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ధనుష్ మరోసారి తన నటనతో అదరగొట్టాడని.. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం సూపర్ అని రివ్యూస్ వస్తున్నాయి. కథ.. పాత్రలను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇక జీవీ ప్రకాష్ అందించిన సంగీతం మరో లెవల్. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక మరోవైపు అదే రోజులన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ 3 కూడా రిలీజ్ కాబోతుంది. కానీ సౌత్ ఇండస్ట్రీలో ధనుష్ కు క్రేజ్ ఎక్కువగా ఉండడంతో ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయం.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page