top of page

ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’..🎥🎞️

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా గత అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.🎥🎞️

పాన్ ఇండియా లెవల్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో ధనుష్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. తిరుచిర్తంబళం, సార్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్.. కెప్టెన్ మిల్లర్ సినిమాతోనే మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అప్పుడే శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోవడంతో కెప్టెన్ మిల్లర్ వెనకబడింది. ఈ చిత్రానికి అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతుండగా సంక్రాంతి సందర్భంగా కేవలం తమిళంలోనే రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా గత అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూడొచ్చు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు కీలకపాత్రలలో నటించారు.

అయితే ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్ కాలేదు. నిజానికి ధనుష్ కు ఉత్తరాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆత్రంగి రే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇందులో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఆయనకు నార్త్ లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమా హిందీలో అందుబాటులోకి రాకపోవడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.🎥🎞️

bottom of page