top of page

🔍 దేవర బ్యాక్ టు హైదరాబాద్‌..| కన్నప్పలో మరో ఇద్దరు స్టార్స్‌...🌟

🏏 బ్యాక్ టు హైదరాబాద్‌: గోవా షెడ్యూల్‌ పూర్తి కావటంతో హైదరాబాద్‌ చేరుకుంది దేవర టీమ్. ముందు గోకర్ణలో నెక్ట్స్ షెడ్యూల్‌ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా, ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను స్కిప్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకొని డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లోనే కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.

🌟 మరో ఇద్దరు స్టార్స్‌: కన్నప్ప సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్‌. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్‌తో సీనియర్ నటులు మోహన్‌ బాబు, శరత్‌ కుమార్ జాయిన్ అయ్యారు. ఇప్పటికే ప్రభాస్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్స్‌ చేస్తున్నట్టుగా వెల్లడించింది కన్నప్ప టీమ్.

📲 డిజిటల్ డెబ్యూ: తమిళ హీరో ఆర్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఆర్య నటించిన సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయినా పూర్తి స్థాయిలో ఓటీటీ కోసం ఓ ప్రాజెక్ట్ ఇంత వరకు చేయలేదు. ఇప్పుడు ది విలేజ్‌ పేరుతో ఓ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు ఆర్య. ఈ షో ఈ నెల 24 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

🎭 కార్తి కోసమే జపాన్‌: కార్తి హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ మూవీ జపాన్‌. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా కథకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు రాజు మురుగన్‌. కార్తి స్వయంగా ఓ కామెడీ కథ రెడీ చేయమని చెప్పటంతోనే జపాన్ కథను సిద్ధం చేశామన్నారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఉంటుందన్నారు. 🇯🇵

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page