top of page
Suresh D

ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..!🔍

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది..

కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంత్రా ఈడీ అఫీసులో ఉన్నారు కవిత. ఇవాళ ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేస్తారు. మధ్యాహ్నం వరకు విచారించి తర్వాత రౌస్‌అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు ఈడీ అధికారులు. అయితే.. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తుండగా.. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. దీంతో.. ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో కలిపి మరోసారి కవితను విచారించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తర్వాత కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈడీ ఆఫీసు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె భర్త, ఆమె తరపు లాయర్.. అక్కడే పడిగాపులు కాసారు. కవిత అరెస్ట్‌తో ఢిల్లీ ఈడీ ఆఫీస్‌ దగ్గర భారీగా పోలీసు బలగాల మోహరించారు.🔍

bottom of page