top of page
MediaFx

ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..


పెరుగుతున్న సాంకేతికత మనిషికి ఎంత సాంత్వన చేకూర్చుతుందో.. అదే స్థాయిలో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. సెక్యూరిటీ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సైబర్ దాడులు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా నేరగాళ్లు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇప్పుడు మరో మాల్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఈ మాల్వేర్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ మాల్వేర్ ఏంటి? దాని వల్ల కలిగే నష్టం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మైక్రోసాఫ్ట్ టీం హెచ్చరిక..

ఆండ్రాయిడ్ వినియోగదారులకు కీలకమైన హెచ్చరిక ఇది. మీ ఫోన్ పై హ్యాకర్‌లకు పూర్తి నియంత్రణను అందించగల కొత్త మాల్వేర్ కొన్ని యాప్స్ ద్వారా మీ ఫోన్లలోకి జొరపడింది.  ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ బృందం తాజా భద్రతా హెచ్చరికగా జారీ చేసింది. ఈ మాల్వేర్ పేరు డర్టీ స్ట్రీమ్. ఇది చాలా ప్రమాదకరమైనదని మైక్రోసాఫ్ట్ బృందం ప్రకటించింది. ఇది ఆండ్రాయిడ్ డివైజ్లోకి చొరబడి ఫోన్ మొత్తాన్ని హ్యాక్ చేస్తుంది. ఫోన్లోని ఒక యాప్ మరొక యాప్ తో మాట్లాడుకోడానికి అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ యాప్లలో దీనిని కంటెంట్ ప్రొవైడర్ అని అంటారు. దీని ద్వారా మీ పరికరంపై మొత్తం నియంత్రణను హ్యాకర్ కు అందిస్తుంది. వాస్తవానికి ఆండ్రాయిడ్ కంటెట్ ప్రోవైడర్ సిస్టమ్ అనేది నిర్ధిష్ట భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇది యాప్ లను దుర్వినియోగం కానివ్వవు. అయినప్పటికీ కొత్త మాల్వేర్ దీనిని అధిగమిస్తుందని తెలుస్తోంది. అలాగే ఆయా యాప్స్ లోని వ్యక్తిగత డేటాను చోరీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే బిలియన్ల కొద్దీ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ యాప్స్ ద్వారా..

ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న పలు యాప్స్ లో ఈ మాల్వేర్ చొరబడినట్లు మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాక దీనిని ఇప్పటికే 4 బిలియన్ల ఇన్ స్టాల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఆ యాప్స్ ఏంటంటే.. జియోమీ ఫైల్ మేనేజర్ ఇది ఒక బిలియన్ కన్నా ఎక్కువ ఇన్ స్టాల్స్ ను కలిగి ఉంది. అలాగే డబ్ల్యూపీఎస్ ఆఫీస్, ఇది కూడా 500 మిలియన్ డౌన్ లోడ్లను కలిగి ఉంది. అయితే శుభవార్త ఏంటంటే ఈ రెండు యాప్స్ తాజా అప్ డేట్లతో భద్రతను అందించింది. అయినప్పటికీ ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సిఫార్లు చేస్తున్నారు.


bottom of page